కట్లేరుకు గోదావరి జలాలు | - | Sakshi
Sakshi News home page

కట్లేరుకు గోదావరి జలాలు

Aug 20 2026 12:29 AM | Updated on Aug 20 2026 12:29 AM

ఎర్రుపాలెం: భద్రాద్రి జిల్లా బీజీ.కొత్తూరులోని పంప్‌హౌస్‌ నుంచి విడుదల చేసిన గోదావరి జలాలు ఎర్రుపాలెం మండలం కట్లేరులోకి బుధవారం చేరాయి. ఈ సందర్భంగా బీమవరంలోని కట్లేరు ప్రాజెక్టు వద్ద భీమవరం, మామునూరు సర్పంచ్‌లు వంగల నాగేశ్వరరావు, షేక్‌ పెద్దబాబు సాహెబ్‌, నాయకులు గోదావరి జలాలకు పూజలు చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యాన కట్లేరుకు గోదావరి జలాలు రావడంతో నీటి కొరత తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాయకులు శీలం శ్రీనివాసరెడ్డి, అనుమోలు కృష్ణారావు, వెల్ల టూరి సత్యనారాయణచారి, గుర్రాల శ్రీనివాసరెడ్డి, మారబత్తుల స్వామి పాల్గొన్నారు.

శాసీ్త్రయ విధానాలతో నాణ్యమైన ఉత్పత్తి

వైరారూరల్‌: పట్టు పురుగుల పెంపకంలో రైతులు శాసీ్త్రయ విధానాలు అవలంబిస్తే నాణ్యమైన ఉత్పత్తి సాధ్యమవుతుందని రాష్ట్ర సెరికల్చర్‌ శాఖ జాయింట్‌ సెక్రటరీ, సీనియర్‌ సైంటిస్ట్‌ జి.సుబ్రహ్మణ్యం తెలిపారు. వైరా మండలం రెబ్బవరంలో ‘మేరా రేషమ్‌.. మేరా అభిమాన్‌’లో భాగంగా కేంద్ర పట్టు మండలి ఆధ్వర్యాన బుధవారం నిర్వహించిన సదస్సుకు 40 మంది పట్టు రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పట్టు పురుగుల పెంపకంలో పరిశుభ్రత, పరికరాల క్రిమిసంహారక చర్యలు కీలకమని తెలిపారు. శాసీ్త్రయ పద్ధతులు, సాంకేతిక సూచనలు పాటిస్తే ఆరోగ్యకరమైన పట్టు పురుగుల పెంపకం, నాణ్యమైన ఉత్పత్తి సాధ్యమవుతుందని చెప్పారు. ఇంకా ఈ సదస్సులో పట్టు పరిశ్రమ అభివృద్ధి సంస్థ జాయింట్‌ డైరెక్టర్‌ అనసూయ తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లాలోని

28 గ్రామాలకు ‘సోలార్‌’

నేలకొండపల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 28 సోలార్‌ మోడల్‌ గ్రామాలను ఎంపిక చేసినట్లు టీజీ రెడ్‌కో జిల్లా మేనేజర్‌ పి.ఆజయ్‌కుమార్‌ తెలిపారు. మండలంలోని చెరువుమాధారంలో సోలార్‌ ప్లాంట్ల పనులను బుధవారం పరిశీలించి మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో ఎంపిక చేసిన 28 గ్రామాల్లో సర్వే అనంతరం 17,426 సర్వీసులను గుర్తించగా, ఇందులో 4,669 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. ప్లాంట్ల ఏర్పాటుకు తొలుత గృహజ్యోతి లబ్ధి దారులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వ్యవసాయానికి 7.5 కిలోవాట్లు, గృహా లకు 2 కిలోవాట్ల రూప్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటుచేసే పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. ఈ పనులు పూర్తయితే పునరుత్పాదక విద్యుత్‌ వినియోగం పెరుగుతుందని, అదనపు విద్యుత్‌ను గ్రిడ్‌కు అందజేస్తే ప్రజలకు ఏటా కనీసం రూ.20 వేల వరకు ఆదాయం వస్తుందని వెల్లడించారు. ఈమేరకు ప్లాంట్ల ఏర్పాటుకు ప్రజలు, రైతులు సహకరించాలని మేనేజర్‌ కోరారు.

ఇద్దరు కార్యదర్శులు,

ఆపరేటర్‌కు నోటీసులు

విధుల్లో నిర్లక్ష్యం, రికార్డుల్లో లోపాలతో చర్యలు

కామేపల్లి: కామేపల్లి మండలం పింజరమడుగు, బర్లగూడెం గ్రామపంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్‌ దివాకర బుధవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఆయా జీపీలను డీపీఓ వినోద్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శులు అభివృద్ధి పనుల రికార్డులను, నిధుల పత్రాలను నిబంధనల ప్రకారం నిర్వర్తించడం లేదని తేలింది. దీంతో వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ పింజరమడుగు, బర్లగూడెం కార్యదర్శులు గోపమ్మ, రాంబాబు కు కలెక్టర్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అలాగే, బర్లగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఈమేరకు కంప్యూటర్‌ ఆపరేటర్‌ నరేష్‌ కూలీల ఖాతాలకు బదులుగా మృతుల ఖాతాల్లోని వేతనాలు బదిలీ చేశారని, పోర్టల్‌లో సంబంధం లేని ఫొటోలను అప్‌లోడ్‌ చేసినట్లు తేలడంతో వివరణ ఇవ్వాలంటూ ఆయనకు కలెక్టర్‌ నోటీసు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement