చికిత్స పొందుతున్న యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతున్న యువకుడు మృతి

Aug 20 2026 12:29 AM | Updated on Aug 20 2026 12:29 AM

కల్లూరు రూరల్‌: గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కల్లూరుకు చెందిన బానోతు వీరు(36) గత శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా హనుమ తండా సమీపాన ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఘటనలో తీవ్రగాయాలైన ఆయనను హైదరాబాద్‌ తరలించగా బుధవారం పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఘటనపై వీరు భార్య రేణుక ఫిర్యాదుతో కల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

చేపల వేటకు వెళ్లిన వ్యక్తి..

చింతకాని: మండలంలోని నాగిలిగొండకు చెందిన మార్కపూడి కొండలరావు (40) బుధవారం చేపల వేటకు వెళ్లగా ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. గాలాలతో చేపలు పట్టడానికి బావి వద్దకు వెళ్లిన ఆయన కాలుజారి బావిలో పడ్డాడు. ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మోటారు వైరే యమపాశమై..

విద్యుదాఘాతంతో గొర్రెల కాపరి మృతి

ఎర్రుపాలెం: మండలంలోని బనిగండ్లపాడు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి అంగడాల వీరబాబు(32)బుధవారం విద్యుఘాతంతో మృతి చెందాడు. రోజులాగే ఆయన గొర్రెలను మేత కోసం చొప్పకట్లపాలెం సమీప పొలాల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ పొలం ఫెన్సింగ్‌పై మోటార్‌ వైరు తెగిపడి ఉన్న విషయాన్ని గమనించిన వీరబాబు వైర్‌ను తాకడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉండగా.. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement