డిజిటలైజేషన్‌లో వేగం పెంచాలి
ఖమ్మం సహకారనగర్: ప్రజావాణిలో అందే ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి(గ్రీవెన్స్ డే)లో భాగంగా ప్రజల నుంచి ఆయన వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను సానుకూల ధృక్పథంతో పరిశీలించి, అర్హత ఉన్న వాటిని పరిష్కరించాలన్నారు. అనంతరం జూన్‌లో ఉద్యోగ విరమణ చేసిన అధికారులను కలెక్టర్ దివాకర సన్మానించారు. వివిధ శాఖల్లో రిటైర్డ్ అయిన సయ్యద్ యూసుఫ్, ఎస్.వీ.నారాయణమూర్తి, పి.సాయిరాంరెడ్డి, ఎస్.చంద్ర భగీరథిదేవి, అల్లం రవికుమార్, షేక్ మదార్, అయూబ్ ఖాన్, కె.వెంకన్న, షేక్ హసన్ పాషా, తేజావత్ పెంటయ్య, ఎం.సిద్దిక్‌ను సన్మానించగా అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డి, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్వో రామమూర్తి, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
‘గౌరవం’గా చూడండి
భూ సర్వే నిమ్తితం ఏడాది క్రితం ప్రభుత్వం సర్వేయర్లకు శిక్షణ ఇచ్చింది. ఆ సమయంలో లైసెన్స్‌లు జారీ చేసి నెలకు రూ.20 వేల ఆదాయం కల్పిస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఎకరం సర్వే చేస్తే రూ.50 మాత్రమే చెల్లిస్తున్నారని, అది కూడా సొంత మండలంలో కాకుండా ఇతర మండలాల్లో సర్వే చేయిస్తున్నారని పలువురు వాపోయారు. ఈమేరకు గౌరవ వేతనం అందేలా చూడాలని కోరుతూ ప్రజావాణిలో కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేశారు.
గ్రీవెన్స్ డేలో కలెక్టర్ దివాకర
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్)లో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, అందిన ఫారాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియ వేగంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా చింతకాని మండలం జగన్నాధపురం నుండి కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, కలెక్టరేట్ నుంచి కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ మంగళవారంలోగా వంద శాతం పూర్తి చేయాలన్నారు. జిల్లా నుంచికలెక్టర్ దివాకర మాట్లాడుతూ ఫారాల పంపిణీ 99.5 శాతం, డిజిటలైజేషన్ 20.9 శాతం పూర్తయిందని తెలిపారు. అర్హత కలిగిన ఎవరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.


