డ్రోన్‌తో ధనాధన్‌! | - | Sakshi
Sakshi News home page

డ్రోన్‌తో ధనాధన్‌!

Aug 24 2026 12:13 AM | Updated on Aug 24 2026 12:13 AM

సొసైటీల ద్వారా సబ్సిడీపై పైరంతా మందు .. కంపెనీ నుంచే శిక్షణ

కూలీల కొరతకూ ఉత్తమ పరిష్కారం సొసైటీలకు సబ్సిడీపై డ్రోన్‌ యూనిట్లు

కూలీల ద్వారా గంటల తరబడి పట్టే పురుగు మందుల పిచికారీ నిమిషాల్లోనే పూర్తవుతోంది. ఇన్నాళ్లు కూలీలు, పవర్‌ స్ప్రేయర్ల కోసం రైతులు ఎదురుచూస్తూ ఆలస్యమయ్యే కొద్దీ పురుగుల బెడదతో పంట నష్టపోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వస్తోంది. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా డ్రోన్‌ సాయంతో తక్కువ సమయంలో పురుగు మందుల పిచికారీ పూర్తవుతోంది. ఖర్చు, శ్రమ తగ్గడమే కాక మందు కూడా ఆదా అవుతోందని చెబుతున్నారు. – తల్లాడ

పవిత్రోత్సవాలకు

అంకురార్పణ

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం పవిత్రోత్సావాలకు అంకురార్పణ జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మేళతాళాల నడుమ పవిత్ర గోదావరి నుంచి తీర్థ బిందెతో జలాన్ని తీసుకొని వచ్చి అంకురార్పణ చేశారు. సోమవారం పవిత్రాధివాసం, అష్టోత్తర కలశావాహన, 25న అష్టోత్తర కలశాలతో స్వామి వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం, పవిత్రారోపణం జరిపి 28న ఉత్సవాలకు ముగింపు పలకనున్నారు. 28న హయగ్రీవ జయంతి వేడుకలు సైతం జరగనున్నాయి. కాగా పవిత్రోత్సాలను పురస్కరించుకుని నిత్యకల్యాణాలను సోమవారం నుంచి ఈ నెల 28 వరకు రద్దు చేసినట్లు ఆలయ ఈఓ దామోదర్‌రావు తెలిపారు.

రామయ్యకు అభిషేకం

దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు ఆదివారం సువర్ణ పుష్పార్చన జరిపారు. రామ సేవా మండపంలో ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.

మహాధర్నాను

విజయవంతం చేయండి

టీజీఈ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు

ఖమ్మం సహకారనగర్‌: సమస్యల పరిష్కారం కోసం ఖమ్మం కలెక్టరేట్‌ వద్ద ఈనెల 27న తెలంగాణ ఉద్యోగ జేఏసీ(టీజీఈ జేఏసీ) ఆధ్వర్యాన చేపట్టే మహాధర్నాను విజయవయంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీజీవోస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని టీఎన్జీవోస్‌ భవన్‌లో ఆదివారం జరిగిన సన్నాహక సమావేశానికి జిల్లా చైర్మన్‌ గుంటుపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా శ్రీనివాసరావు మాట్లాడారు. ఉద్యోగుల హెల్త్‌ స్కీమ్‌ పూర్తిస్థాయిలో అమలుచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, పీఆర్‌సీని అమలుచేస్తూ, పెండింగ్‌ డీఏలు, బిల్లులు చెల్లించాలన్నారు. సీపీఎస్‌ రద్దుకు జేఏసీ కృషి చేస్తోందని తెలిపారు. ఈ సమావేశంలో అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

జిల్లాలో తొలిసారి తల్లాడ మండలంలోని మూడు సొసైటీలకు సబ్సిడీ ద్వారా డ్రోన్‌ పరికరాలు అందజేశారు. ఒక్కో డ్రోన్‌ యూనిట్‌ ధర రూ.10లక్షలు కాగా, రూ.4లక్షలు సబ్సిడీ పోను మిగిలిన రూ.6 లక్షలు బ్యాంక్‌ లింకేజీ ఇస్తుంది. గంగదేవిపాడు, తల్లాడ, కలకొడిమ సొసైటీలకు డ్రోన్‌ యూనిట్లు మంజూరు కావడంతో చైన్నెకి చెందిన కంపెనీ బాధ్యులు సొసైటీల సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. ఇప్పుడు కావాల్సిన రైతుల పైర్లపై డ్రోన్‌ ద్వారా మందు పిచికారీ చేయిస్తూ వచ్చే ఆదాయాన్ని రుణం తీర్చేందుకు ఉపయోగిస్తున్నారు.

ఏ పంట అయినా...

డ్రోన్‌ ద్వారా రకాల పైర్లపై పురుగు మందులు పిచికారీ చేయొచ్చు. వరితో పాటు పత్తి, మిర్చి పైర్లపైనా ప్రస్తుతం మందుల పిచికారీకి పలువురు డ్రోన్‌ ఉపయోగిస్తున్నారు. ఫోన్‌ చేస్తే చాలు ఆటోలో యూనిట్‌తో సహా వస్తున్న నిర్వాహకులు చకచకా పని కానిచ్చేస్తున్నారు. కూలీలు, పవర్‌ స్ప్రేయర్లతో మందు పిచికారీ చేస్తే ఎకరానికి రూ.1,600 చొప్పున వెచ్చించినా రోజంతా సమయం పట్టేది. కానీ డ్రోన్‌ సాయంతో అదే ఖర్చుతో గంటలోనే ఆరు నుంచి ఎనిమిది ఎకరాల్లో మందు పిచికారీ పూర్తవుతోంది. గతంలో ఎకరానికి 90లీటర్లు నీరు అవసరం కాగా, డ్రోన్‌కు 15 లీటర్ల నీరు సరిపోతోంది. అలాగే, డ్రోన్‌ ఉపయోగంతో మందు పంట అంతటా సమానంగా పడి వృథా తగ్గుతోంది. అలాగే, రైతులకు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే పరిస్థితి ఉండదు. ఇతర పంటలతో పోలిస్తే వరి పైరులో బురద కారణంగా మందుల పిచికారీకి ఇబ్బంది ఎదురవుతుంది. కానీ డ్రోన్‌ ఉపయోగంగా ఆ సమస్య కూడా రావడం లేదు.

డ్రోన్‌ ద్వారా ఖర్చు తగ్గడమే కాక పైరంతా మందు పడుతోంది. డ్రోన్‌కు నీరు తక్కువగా పట్టడంతో పాటు సమ యం కలిసొస్తుంది. ఈసారి 20 ఎకరాల్లో ప్రత్తి, వరి ఫైరు సాగు చేశా. మొత్తం పంటంతా డ్రోన్‌ ద్వారానే మందు స్ప్రే చేయించా.

– తమ్మిశెట్టి తిరుపతరావు, రైతు, తల్లాడ

డ్రోన్‌ వాడకంపై కంపెనీ ద్వారా శిక్షణ ఇస్తారు. వీటి ద్వారా సులభంగా అన్ని రకాల పంటలపై పురుగు మందులు స్ప్రే చేయొచ్చు. మండలంలో మూడు సొసైటీలకు డ్రోన్లు సబ్సిడీపై అందాయి. రైతులు వాడకానికి ఆసక్తి ఊపుతున్నారు.

ఎం.డీ.తాజుద్దీన్‌, ఏఓ, తల్లాడ

నేటి నుంచి 28 వరకు

నిత్యకల్యాణాలు నిలిపివేత

మందుల పిచికారీలో ఖర్చు, శ్రమ తక్కువ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement