ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం యాగశాల నుంచి పవిత్రాలను తీసుకొచ్చి శ్రీవారి ఆలయంతో పాటు ప్రాంగణంలోని అన్ని ఉప ఆలయాల గోపురాలు, ధ్వజస్తంభాలకు ధారణ చేశారు. అనంతరం యాగశాలలో మండపారాధన, శ్రీవారికి పంచామృతంతో అభిషేకం, స్వామి, అమ్మవార్ల నిత్య కల్యాణం జరిపించారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్, అర్చకులు
వచ్చేనెల 6న టీయూసీఐ రాష్ట్ర జనరల్ కౌన్సిల్
ఖమ్మంమయూరిసెంటర్: ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా(టీయూసీఐ) రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశం వచ్చేనెల 6న ఖమ్మంలోని రామనరసయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.ఎల్.పద్మ తెలిపారు. ఖమ్మంలో ఆదివారం జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, పోరాట కార్యాచరణ రూపకల్పనకు జనరల్ కౌన్సిల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్రప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. తెలంగాణలో సుమారు నాలుగు లక్షల మంది కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనాలు లేక దుర్భర జీవితం గడుపుతున్నారన్నారు. ఈ నేపథ్యాన జరిగే కౌన్సిల్‌లో భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు ఎస్.కే.యాకూబ్ షావలీ, జి.రామ య్య, కొయ్యల శ్రీనివాస్, వి.బాబు, శరత్, ఎస్.కే.లాల్‌మియా తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలతో క్రీడాకారులకు మేలు
ఖమ్మం స్పోర్ట్స్: ఈ ఏడాది జరిగే రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలను ఖమ్మంలో నిర్వహించేలా చొరవ చూపాలని హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జాతీయ సంయుక్త కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్ సూచించారు. ఖమ్మంలో ఆదివారం జరిగిన అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మంలో ఉత్తమ క్రీడాకారులు ఉన్నందున పోటీల నిర్వహణతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో హ్యాండ్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అశోక్‌రెడ్డి, వి.మోహన్‌రావుతో పాటు రాము, లక్ష్యయ్య పాల్గొన్నారు.


