కుటుంబ కలహాలతో ఆత్మహత్య ! | - | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో ఆత్మహత్య !

Jul 23 2023 12:16 AM | Updated on Jul 23 2023 12:45 PM

- - Sakshi

ఖమ్మం: కుటుంబ కలహాల నేపథ్యాన ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధిరకు చెందిన సంపసాల నరేష్‌(34) కొంతకాలం ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేశాక సొంతంగా మెడికల్‌ షాపు ఏర్పాటుచేసినా నష్టాలు రావటంతో మూసివేశాడు.

ఈక్రమంలో దమ్మపేట మండలం రామచంద్రాపురానికి చెందిన మాధవిని కులాంతర వివాహం చేసుకోగా వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఏడాదికాలంగా నరేష్‌ భార్యాపిల్లలతో అత్తగారింట్లో ఉంటూనే ఉద్యోగం కోసం ఆస్ట్రేలియా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇటీవల దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది. దీంతో ఈనెల 21న రామచంద్రాపురం నుంచి మధిరకు వచ్చిన నరేష్‌ శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కాగా, నరేష్‌ ఆత్మహత్యకు ముందు ‘ఎదుటివారికి కష్టం వస్తే కులం లేదు, మతం లేదు. సృష్టి వినాశనం వచ్చినపుడు ఎవరు వచ్చారో నువ్వు ఆలోచించు. నీ ప్రాణం మీదకు వస్తేనే నీకు తెలుస్తుంది. మళ్లీ చెబుతున్నా నీ ప్రాణం మీదకు వస్తేనే నీకు తెలుస్తుంది. సర్వేజనా సుఖినోభవంతు.’ అంటూ వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టినట్లు కుటుంబీకులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement