
రమేష్ (ఫైల్)
ఖమ్మం: మండలంలోని గట్టుసింగారం గ్రామానికి చెందిన బొల్లం రమేష్ (21) మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదే గ్రామంలో ఉంటున్న తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. మధ్యాహ్నం ఆమె వచ్చేసరికి గడియ పెట్టి ఉండడంతో కిటికీలో నుండి చూడగా రమేష్ ఉరి వేసుకుని ఉండడంతో స్థానికులతో కలిసి తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే మృతి చెందాడు.
కాగా, రమేష్‌కు అదే గ్రామంలోని ఓ యువతితో ప్రేమ వ్యవహారం ఉండగా, ఆమె బంధువులు ఇటీవల ఇంటిపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనతోనే మనస్తాపానికి గురైన రమేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆయన తండ్రి లింగయ్య చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్‌కుమార్ తెలిపారు.