సాక్షి బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి, అక్రమాలు పెరిగిపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ తాము చేపట్టిన పాదయాత్రతో ప్రభుత్వానికి వణుకు పుడుతోందని, సీఎం డీకే.శివకుమార్‌కు నిద్ర లేకుండా చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర పేర్కొన్నారు. సోమవారం బీజేపీ పాదయాత్ర ఏడో రోజుకు చేరుకుంది. కంప్లి తాలూకాలో బీజేపీ పాదయాత్రకు ఘనస్వాగతం లభించింది. బీవై. విజయేంద్రతో పాటు మాజీ మంత్రి శ్రీరాములు, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీ తేజస్ సూర్య, బీజేపీ జాతీయ కార్యదర్శి సీటీ రవి, మాజీ ఎమ్మెల్యే టీహెచ్ సురేష్‌బాబు తదితరులు పాదయాత్రలో పాల్గొనడంతో ఆయా గ్రామాల్లో రైతులు, స్థానికులు ఘనస్వాగతం పలికారు. భారీ జనసందోహంతో కంప్లి తాలూకా దేవలాపురకు పాదయాత్ర చేరుకుంది.
పెచ్చుమీరిన అవినీతి
ఎస్సీ, ఎస్టీలకు కేటాయించినా రూ.52 వేల కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని, మహర్షి వాల్మీకి అభివృద్ధి మండలిలో రూ.187 కోట్ల అభివృద్ధి నిధులను కాజేశారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి పెచ్చుమీరిందని ధ్వజమెత్తారు. యువశక్తి భారత దేశానికి భవిష్యత్తు అని, అయితే సరైనా దిశగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కేపీఎస్సీ నియామక ప్రక్రియలో నోటిఫికేషన్, పరీక్ష ఫలితాలు, ఇంటర్వ్యూల తర్వాత నెలల తరబడి కాలయాపన జరుగుతోందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేపీఎస్సీలో సంస్కరణలు తేవడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో పారదర్శకతను పాటిస్తామన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి మాట్లాడుతూ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పది రోజులు నిర్వహించాలని సూచించారు. మంత్రి పదవికి నాగేంద్ర రాజీనామా చేసినా పాదయాత్రకు విశేష మద్దతు లభిస్తోందన్నారు. అయితే ప్రభుత్వం కొత్తగా ప్రజాసేవ అంటూ జనంలోకి వెళ్తుండటం సిగ్గుచేటన్నారు. గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్థన్‌రెడ్డి, మాజీ మంత్రి బీ.శ్రీరాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
సీఎంకు నిద్ర దూరం చేస్తున్న పోరాటం
కళ్యాణ కర్ణాటకకు ప్రత్యేక ప్రాధాన్యత
బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర


