ఘోర ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం

Sep 10 2026 12:09 AM | Updated on Sep 10 2026 12:09 AM

మండ్య: మండ్య జిల్లాలోని నాగమంగళలో బుధవారం మధ్యాహ్నం బెంగళూరు–మంగళూరు హైవేలో ఘోర ప్రమాదం జరిగింది. దేవిహళ్లి గేట్‌ దగ్గర ముందు ఇనుప పైపులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను కేఎస్‌ఆర్టీసీ బస్సు ఢీకొనింది. దీంతో పైపులు బస్సులోకి చొచ్చుకెళ్లాయి. అవి తగిలి బస్సు డ్రైవరు, హోళెనరసిపురవాసి శేఖర్‌ (47) మరణించగా, ట్రాక్టర్‌ డ్రైవర్‌ అప్పాజి తీవ్రంగా గాయపడ్డారు. బస్సులోని మరో ఏడుమంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు బెంగళూరు నుంచి హాసన్‌కు వెళ్తోంది. బెల్లూరు పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఆర్టీసీ బస్సులోకి దూసుకెళ్లిన పైపులు

డ్రైవరు మృతి, 8 మందికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement