కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని ధర్నా | - | Sakshi
Sakshi News home page

కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని ధర్నా

Sep 10 2026 12:03 AM | Updated on Sep 10 2026 12:03 AM

రాయచూరు రూరల్‌: యాదగిరి, గురుమఠకల్‌ను కరువు ప్రాంతాలుగా ప్రకటించి రైతులకు బ్యాంక్‌ రుణాలను రద్దు చేయాలని గురుమఠకల్‌ శాసన సభ్యుడు శరణేగౌడ డిమాండ్‌ చేశారు. బుధవారం యాదగిరి జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. జిల్లాధికార యంత్రాగం కరువు తాలూకాలుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా జేడీఎస్‌ ఎమ్మెల్యేననే భావనతో కరువు ప్రాంతాలుగా ప్రకటించకుండా జాబితా నుంచి తొలగించారన్నారు. రైతులు పొలాల్లో వేసిన పంటలు వర్షాలు లేక వాడుముఖం పట్టాయన్నారు. వాణిజ్య బ్యాంక్‌లో రైతులు తీసుకున్న పంట రుణాలను రద్దు చేయాలని కోరుతూ జిల్లాధికారికి వినతిపత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement