దున్నేవాడికే భూమి కేటాయించాలి | - | Sakshi
Sakshi News home page

దున్నేవాడికే భూమి కేటాయించాలి

Sep 10 2026 12:03 AM | Updated on Sep 10 2026 12:03 AM

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో సన్న, చిన్న కారు రైతులైన దున్నేవాడికే భూమిని కేటాయించాలని సీపీఐఎంఎల్‌ (రెడ్‌స్టార్‌) అధ్యక్షుడు మానసయ్య డిమాండ్‌ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేఽశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 16 నుంచి 19 వరకు 13వ జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో నాలుగు రోజుల పాటు జరిగే సమావేశాలకు శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌, కెన్యా, కిర్గిజ్‌స్థాన్‌తో పాటు 14 దేశాల నుంచి నేతలు వస్తారన్నారు.

ఓటరు జాబితా సవరణపై

జాగృతి జాతా

రాయచూరు రూరల్‌: ఓటరు జాబితాలో సవరణకు ప్రజలు సహకరించాలని జిల్లా ఆరోగ్య అధికారిణి నందిత పేర్కొన్నారు. బుధవారం జిల్లా ఆరోగ్యాధికారిణి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జాగృతి జాతాను ప్రారంభించి ఆమె మాట్లాడారు. ఓటరు జాబితాల్లో జిల్లాలో 2.50 లక్షల మంది పేర్లు ఉండగా సర్వేలో పేర్లు నమోదు కాని వారు, పెండింగ్‌లో ఉన్నవారు, ముద్రితమైన ఓటరు జాబితాలో ఉన్న లోపాలను ఇంటి యజమానులు సవరించి ఇవ్వాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement