రాయచూరు రూరల్: రాష్ట్రంలోని ఉత్తర, కళ్యాణ కర్ణాటక జిల్లాల రైతులకు కరువు పరిహారం అందించాలని రైతు సంఘం అధ్యక్షుడు నరసింహ నాయక్ పేర్కొన్నారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేఽశంలో ఆయన మాట్లాడారు. రైతులు, ప్రజలు కరువుతో కొట్టుమిట్టాడుతుంటే ప్రజా ప్రతినిధులు మౌనం వహించడం తగదన్నారు. వాల్మీకి మండలి అక్రమాలపై పాదయాత్రలు చేసే నేతలు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవాలన్నారు. ముఖ్యమంత్రి శివ కుమార్, మంత్రులు, శాసన సభ్యులు అక్రమాలతో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరందడం లేదన్నారు. గేజ్ నిర్వహణలో లోపాలను సవరించాలన్నారు. కరువు పరిహారం కింద ఎకరాకు రూ.25 వేలు చొప్పున ఇవ్వాలన్నారు. నిర్ణీత గడువులోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలన్నారు. మల్లనగౌడ, మంజుల, ధర్మారెడ్డి, నరసింహారెడ్డి, శివశరణ, జంగ్లీ పీర్‌లున్నారు.


