ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలు | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలు

Sep 10 2026 12:03 AM | Updated on Sep 10 2026 12:03 AM

హొసపేటె: ఉపాధ్యాయులు పిల్లలకు విద్యా పరిజ్ఞానాన్ని అందించి వారి భవిష్యత్తును తీర్చిదిద్దే ఉత్తమ సమాజ నిర్మాతలు అని విజయనగర జిల్లా కూడ్లిగి ఫ్రెండ్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ అబ్దుల్‌ రెహమాన్‌ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ మోడల్‌ బాలుర ఉన్నత ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఆయన మాట్లాడారు. రేపటి పౌరులైన నేటి పిల్లలు మంచి విద్యను అభ్యసించి, ఉన్నత పదవులను పొంది, దేశ నాయకులుగా ఎదిగి, దేశ ప్రగతిలో ముందుండి నడిపించాలని అన్నారు. అప్పుడే ఉపాధ్యాయులు బోధించే విద్యకు అర్థం చేకూరుతుందని ఆయన అన్నారు. విద్యతో పాటు ఉపాధ్యాయులు క్రమశిక్షణ, సంయమనం, సంస్కృతిని కూడా నేర్పిస్తారని, వారి పాత్ర గొప్పదని అన్నారు. ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు శివానంద, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భీమప్ప, తోటి ఉపాధ్యాయులు శివానంద, శోభ రత్నమ్మ, సుమ, శైలజ, రాజమ్మ, విజయ, జ్యోతి, అశ్విని, మానస తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement