రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంత ప్రజల దరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి అజయ్‌సింగ్ పేర్కొన్నారు.శ శనివారం మాన్వి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా సేవ పథకాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికలో ఇచ్చిన హామీల ప్రకారం లబ్ధిదారులకు పథకాలను అందించారన్నారు. ముఖ్యమంత్రి డీ.కే.శివ కుమార్ ఆదేశాల మేరకు ప్రజల వద్దకు పాలనను అందించాలనే ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలన్నారు. కల్యాణ కర్ణాటక ప్రాంతం అభివృద్ధికి రూ.18 వేల కోట్లు ఖర్చు చేస్తారన్నారు. జిల్లాధికారిణి పూవిత, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, ఎస్పీ అరుణాంగ్శు గిరి, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారిణి శరణమ్మ, జిల్లా ఆరోగ్య అధికారిణి నందితలున్నారు. దేవదుర్గలో శాసన సభ్యురాలు కరెమ్మ, గ్రామీణలో శాసన సభ్యుడు బసనగౌడ, సింధనూరు శాసన సభ్యుడు హంపనగౌడ బాదర్లి, మస్కి శాసన సభ్యుడు బసన గౌడ తుర్విహాళ్ తమ తమ నియోజకవర్గాల్లో ప్రజా సేవ కార్యక్రమాలను ప్రారంభించారు. కలబుర్గిలో మంత్రి ప్రియాంక్ ఖర్గే, యాదగిరిలో మంత్రి శరణ ప్రకాష్ పాటిల్, విజయపురలో ఎంబీ పాటిల్, బాగల్‌కోటెలో విజయానంద కాశప్పనవర్, బీదర్‌లో ఈశ్వర్ ఖండ్రే ప్రజా సేవ కార్యక్రమాలను ప్రారంభించారు.
జిల్లా ఇంచార్జి మంత్రి అజయ్‌సింగ్
ప్రజా సేవ కార్యక్రమానికి శ్రీకారం


