నేటి నుంచి సీరత్‌ అభియాన్‌ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి సీరత్‌ అభియాన్‌

Aug 26 2026 12:06 AM | Updated on Aug 26 2026 12:06 AM

బళ్లారిఅర్బన్‌: మహమ్మద్‌ ప్రవక్త జయంతిని పురస్కరించుకొని జమాత్‌–ఏ–ఇస్లామీ హింద్‌ కర్ణాటక ఆధ్వర్యంలో బుధవారం నుంచి సెప్టెంబర్‌ 6 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సీరత్‌ అభియాన్‌ నిర్వహించనున్నట్లు సంస్థ బళ్లారి విభాగం ప్రతినిధి సయ్యద్‌ నాసీర్‌ తెలిపారు. బళ్లారిలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహ్మద్‌ ప్రవక్త బోధించిన సత్యం, న్యాయం, కరుణ, సమానత్వం, మానవగౌరవం, సోదరభావం వంటి విలువలను ప్రజలకు పరిచయం చేయడమే కార్యక్రమ ఉద్దేశమన్నారు. వివిధ వర్గాల మధ్య సౌహార్దాన్ని పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సిద్దన్న, అబ్దుల్‌ ఖలీక్‌, అబ్దుల్‌, సయ్యద్‌ అమ్జాద్‌ హుస్సేన్‌, నౌజ్‌ బెళగావి, లతీఫ్‌ అహ్మద్‌, సయ్యద్‌ నిజాముద్దీన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement