రాయచూరు రూరల్: జిల్లాలోని సిరవార తాలూకా హొక్రాణిలో గత గురువారం దళిత యువతి అశ్వినిపై హత్యాచారానికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ర్యాలీనుద్దేశించి ఆందోళనకారులు మాట్లాడారు. జిల్లాలోని హద్దినాళ, హొక్రాణి, కరడకల్‌లో దళిత మహిళల మృతికి కారకులైన వారిపై చర్యలు చేపట్టాలని ఒత్తిడి చేశారు. జిల్లాలో నెల రోజుల వ్యవధిలో ముగ్గురు దళితులు హత్యకు గురయ్యారన్నారు. అదే విధంగా కేసును నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ చేపట్టాలని దళిత సమర సేన డిమాండ్ చేసింది. మంగళవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు హన్మంతు మాట్లాడారు.


