వేడుకగా శిలామూర్తుల ఊరేగింపు | - | Sakshi
Sakshi News home page

వేడుకగా శిలామూర్తుల ఊరేగింపు

Aug 26 2026 12:06 AM | Updated on Aug 26 2026 12:06 AM

రాయచూరు రూరల్‌: శ్రావణ మాసం సందర్భంగా కోటలో వెలసిన నూతన వర వీర మారుతి నూతన శిలామూర్తులను వేడుకగా ఊరేగించారు. మంగళవారం రాయచూరు కోటలోని వర వీర మారుతి దేవాలయంలో నూతతంగా పంచలోహాలతో తయారు చేసిన ఆంజనేయ కలశారోహణం, నాగ దేవత, గోపురాలు, ధ్వజస్తంభ ప్రతిష్టాపనలకు ప్రత్యేక పూజలు చేపట్టారు. అభిషేకం, కుంకుమార్చన, పుష్పార్చన, మహా మంగళ హారతిలను నెరవేర్చారు. కిల్లే బృహన్మఠం నుంచి ఆలయం వరకు మహిళలు ప్రత్యేకంగా కుంభ కలశాలతో ఊరేగింపుగా తరలి వచ్చారు. పదాధికారులు రమేష్‌, రవి, సంతోష్‌, యల్లప్ప, ఆంజనేయ, గోవిందు, శంకర్‌, శివమూర్తి, కిట్టు, మురళి, రాములు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement