అమ్మవార్లకు శ్రావణ శోభ | - | Sakshi
Sakshi News home page

అమ్మవార్లకు శ్రావణ శోభ

Aug 26 2026 12:06 AM | Updated on Aug 26 2026 12:06 AM

హొసపేటె: శ్రావణమాసంలో పవిత్రమైన మంగళవారం రోజున నగరంలో అత్యంత పూజ్యనీయులైన ఊరమ్మ, సొల్లమ్మ దేవతలకు తమలపాకు అలంకరణల్లో ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని ప్రధాన ఆలయాలు ఊరమ్మదేవి ఆలయం, పాదగట్టె ఆలయం, సొల్లమ్మదేవి ఆలయంలో దేవతలకు తమలపాకులను సమర్పించారు.

యువకుడి ఆత్మహత్య..

ఏడుగురిపై కేసు

రాయచూరు రూరల్‌: యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో భార్యతో పాటు ఆరుగురిపై లింగసూగూరు తాలూకాలో కేసు నమోదైంది. పరాపుర తాండాకు చెందిన సురేష్‌(28), అతని తల్లి తారాబాయి పొట్టకూటి కోసం బెంగళూరు వెళ్లారు. భార్య, ముగ్గురు చిన్నారులను పిలుచుకెళ్లడానికి అత్తింటికి వచ్చిన సురేష్‌ను భార్య, కుటుంబ సభ్యులు కలిసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని హట్టి పోలీస్‌ స్టేషన్‌లో మృతుని తల్లి తారాబాయి ఫిర్యాదు చేసింది. రెండు రోజుల క్రితం తనకు ఫోన్‌ చేసి తనపై భార్య, కుటుంబ సభ్యులు దాడి చేస్తున్నారని కుమారుడు వాపోయినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈనేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement