మండ్య: రైతుల నుంచి బలవంతపు భూసేకరణలు, కార్పొరేట్ సంస్థలచే భూ కబ్జాలు, ధరల పెరుగుదలకు నిరసనగా కార్పొరేట్ సంస్థలు క్విట్ ఇండియా అనే నినాదంతో వివిధ రైతు, కమ్యూనిస్టు సంఘాలు సోమవారం బృహత్ ఆందోళన నిర్వహించాయి. మండ్యలో సిల్వర్ జూబ్లీ పార్కు వద్ద గుమిగూడిన కార్యకర్తలు, బెంగళూరు–మైసూరు హైవే మీదుగా పాదయాత్ర చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. వీబీజీ చట్టాన్ని రద్దు చేసి ఉపాధి హామీని కొనసాగించాలన్నారు. రైతులు–వ్యవసాయ కూలీల రుణాలను రద్దు చేయాలన్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, డీజిల్ తదితరాల ధరలను తగ్గించాలని పలు డిమాండ్లను వినిపించారు. పోలీసులు వారిని అడ్డుకుని వాహనాలలో తరలించారు.


