హుబ్లీ: ధార్వాడ హెబ్బళ్లి రోడ్డు గాలి వీధిలోని ముదిమారుతి గుడి సముదాయ భవనంలో అంతర్జాతీయ యోగా గురువు భవర్‌లాల్ ఆధ్వర్యంలో ఆదివారం ఆషాఢమాస విశేష అగ్నిహోత్ర అనుష్టాన వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భవర్‌లాల్ మాట్లాడుతూ.. చాలా ఏళ్ల క్రితం యోగా సామాన్యులకు దూరంగా ఉండేదన్నారు. నేడు విశ్వవ్యాప్తంగా యావత్ జగత్తు యోగా సాధన చేస్తోందని తెలిపారు. అగ్నిహోత్రను అభ్యసించి అధ్యాత్మిక లాభంతో పాటు శారీరక, మానసిక ఆరోగ్య లబ్ధిని పొందవచ్చని శాసీ్త్రయంగా రుజువు అయిందన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటి మేయర్ రత్నబాయి, కార్పొరేటర్ దీపా, ఆ ఆలయ ప్రముఖులు రవి, వాసు, లీలావతి, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


