భూబాధితులకు న్యాయం చేయండి | - | Sakshi
Sakshi News home page

భూబాధితులకు న్యాయం చేయండి

Aug 9 2026 2:04 AM | Updated on Aug 9 2026 2:04 AM

రాయచూరు రూరల్‌: హట్టి బంగారు గనుల కోసం భూములు పోగోట్టుకున్న రైతులకు న్యాయం చేయాలని లింగసూగూరు మాజీ ఎమ్మెల్యే హొలిగేరి డిమాండ్‌ చేశారు. శనివారం హట్టి బస్టాండ్‌లో ఆందోళన చేపట్టిన రైతులకు మద్దతు తెలిపి ఇంచార్జి మంత్రి అజయ్‌ సింగ్‌తో మాట్లాడారు. రైతులు బ్యాంక్‌లో రుణాలు పొందాలంటే భూమి ఖాతాలో హట్టి గని స్థలమని పేర్కొనడంతో రైతులు పంటలను సాగులు చేయడం కష్టమైందన్నారు. 450 ఎకరాల భూమి గని పేరు మీద నమోదు కావడం విడ్డూరంగా ఉందన్నారు. భూములు పోగొట్టుకున్న రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. జిల్లాధ్యక్షుడు వలీబాబు, శంకర గౌడ, నారాయణప్ప, సరస్వతి, సంగీత, ఈరమ్మ, నింగప్ప, శివరాజ్‌, వెంకోబ, శరణప్ప, మల్లికార్జునలున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement