హొసపేటె: తాలూకాలోని కడ్డిరాంపురలో మురుగన్ ఆలయం 53వ శంకుస్థాపన వార్షికోత్సవాన్ని వందలాది మంది భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఆడి కృత్తిక మహోత్సవంలో భాగంగా ఉదయం ఆలయం నుంచి గంగమ్మ ఊరేగింపు జరిగింది. అక్కడ కావడిలకు అభిషేకం చేసి అలంకరించారు. అనంతరం కావిడి, పూర్ణ కుంభాలను మోసుకుంటూ ఊరేగింపుగా వెళ్లారు. కృత్తిక మహోత్సవంలో భాగంగా భక్తి పరాకాష్టకు చేరింది. భక్తులు తమ వీపులకు ఇనుప కొక్కాలను కట్టుకుని రాళ్లను, ఆటోలను లాగడం, జేసీబీ యంత్రానికి తాళ్లు కట్టుకుని ఉయ్యాలలా ఊగడం ద్వారా తమ భక్తిని చాటారు. కడ్డిరాంపుర, హంపీ, కమలాపుర తదితర చోట్ల నుంచి ఆడికృత్తిక మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మురుగన్ స్వామి వారికి
ప్రత్యేక అలంకరణలు
పెద్ద సంఖ్యలో తరలి వచ్చి
వేడుకల్లో పాల్గొన్న భక్తులు


