ఆధ్యాత్మికతతో ఒత్తిడి లేని జీవితం | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మికతతో ఒత్తిడి లేని జీవితం

Aug 8 2026 12:29 AM | Updated on Aug 8 2026 12:29 AM

బనశంకరి: ఆధ్యాత్మికత, ధ్యానంతో ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవితం గడపవచ్చునని వేదపండితుడు గణపతిభట్‌ తెలిపారు. శ్రీశివబాలయోగిమహారాజ్‌ 65వ తపస్సిద్ది వార్షికో త్సవం సందర్భంగా బెంగళూరు జేపీ.నగర మూడో ఫేజ్‌ శ్రీశివబాలయోగి మహారాజ్‌ ఆశ్రమంలో శుక్రవారం ట్రస్ట్‌ కార్యాధ్యక్షుడు డీ.రాంబాబుతో కలిసి సమాధి పూజ నిర్వహించి మాట్లాడారు. భగవంతుడు ఇచ్చిన జన్మను సార్థకం చేసుకోవాలంటే మంచి నడవడిక, దానగుణంతో ఉండాలన్నారు. చెడు ఆలోచనలు వీడి భక్తిమార్గంలో ముందుకు సాగాలన్నారు. అనంతరం ప్రపంచశాంతికోసం పూజలు,హోమాలు నిర్వహించారు. శివబాలయోగిమహారాజ్‌ విగ్రహానికి మరకత శివలింగానికి కుంభాభిషేకం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆశ్రమంలో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement