హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పలు జిల్లాల ప్రజలకు, రైతులకు నీరందించే ప్రధాన జలాశయం తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తింది. మంగళవారం సాయంత్రం డ్యాంకు ఇన్‌ఫ్లో 1,08,531 క్యూసెక్కులకు చేరుకుంది. ఔట్ ఫ్లో 1,556 క్యూసెక్కులు నమోదైంది. కర్ణాటక, ఏపీ తాగునీటి అవసరాల కోసం కాలువల ద్వారా 1,390 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. డ్యాం గరిష్ట నీటిమట్టం 1633 అడుగులు, నీటి నిల్వ 105 టీఎంసీలకుగాను ప్రస్తుతం డ్యాంలో నీటినిల్వ 53.648 టీఎంసీలకు చేరుకుందని మండలి అధికార వర్గాలు తెలిపాయి. డ్యాంలోకి భారీగా వరద చేరుతుండటంతో నీటిమట్టం క్రమేణ పెరుగుతోంది. దీంతో ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది.
ఉప్పొంగిన కృష్ణమ్మ
రాయచూరు రూరల్: పైభాగంలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నది ఉప్పొంగుతోంది. ఆల్మట్టి డ్యాం నుంచి కృష్ణా నదికి 1.50 లక్షల క్యూసెక్కులను నారాయణపుర డ్యాంకు వదిలారు. మంగళవారం నారాయణపుర డ్యాం నుంచి 1 లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
లక్ష క్యూసెక్కులు దాటిన ఇన్‌ఫ్లో
డ్యాంకు కొనసాగుతున్న ప్రవాహం


