రాయచూరు రూరల్: రాయచూరు, కొప్పళ జిల్లాలకు నీరందించే తుంగభద్ర ఎడమ కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలని కొప్పళ జిల్లా బచావ్ ఆందోళన సమితి అధ్యక్షుడు అగ్ని దివ్య డిమాండ్ చేశారు. సోమవారం కొప్పళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టి మాట్లాడారు. తుంగభద్ర పరిధిలో కరువు ఛాయలు నెలకొన్నాయన్నారు. డ్యాంలో నీటి సామర్థ్యాన్ని బట్టి కాలువలకు నీటిని విడుదల చేస్తే ఖరీఫ్ సీజన్‌లో వరి పంట సాగు చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం మాజీ మంత్రి బోసురాజ్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లికార్జున నాగప్ప, మాజీ ఎమ్మెల్సీ శ్రీనాథ్, శాంతప్ప, అమరేగౌడ, శివ మూర్తి, రుద్రప్ప అంగడి తదితరులు పాల్గొన్నారు.


