నారాయణపుర డ్యాంకు భారీ వరద | - | Sakshi
Sakshi News home page

నారాయణపుర డ్యాంకు భారీ వరద

Aug 4 2026 12:11 AM | Updated on Aug 4 2026 12:11 AM

రాయచూరు రూరల్‌: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. సోమవారం నారాయణపుర డ్యాం నుంచి 1,40,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దేవదుర్గ తాలూకా కొప్పర వద్ద రహదారి నీటి ఉధృతికి పూర్తిగా కొట్టుకుని పోయింది. దేవదుర్గ తాలుకా హువిన హడగలి వంతెనపై వరద నీరు ప్రవహించడంతో కలబుర్గికి రాకపోకలు ఆగిపోయాయి. హువిన హడగలి వద్ద బసవేశ్వర దేవాలయం నీటిలో మునిగిపోయింది. జిల్లా అధికారి పూవిత వరద ప్రవాహంపై అధికారులతో చర్చించారు. నదీ తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement