ఫలాపేక్ష లేకుండా సేవ చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఫలాపేక్ష లేకుండా సేవ చేయాలి

Aug 3 2026 3:45 AM | Updated on Aug 3 2026 3:45 AM

రాయచూరు రూరల్‌: సమాజంలో పేదలకు సేవ చేయాలనే మనోభావం కలిగి ఉండాలే తప్పే ఫలితం ఆశించరాదని క్రాంతి గ్లోబల్‌ ఫౌండేషన్‌ సంచాలకులు జోనాథన్‌ విక్రం పేర్కొన్నారు. ఆదివారం నగరంలో ఫౌండేషన్‌ సంస్థాపకుడు సన్ని పుట్టిన రోజున పేదలకు, విద్యార్థులకు తన చేతనైనంత ఉడుతా భక్తితో మానవతా దృక్పథంతో సేవలు చేస్తున్నారన్నారు. అనంతరం పేదలకు బీపీ, షుగర్‌, మధుమేహం, ఇతర రోగాలకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం ముదావహం అన్నారు. రాజు, దురుగేష్‌, ముద్దరంగప్ప, వెంకటేష్‌, కాశీం, మల్లు, మల్లప్ప, తిమ్మన్న, రమేష్‌, శివ కాశీలున్నారు.

దేశ రక్షణలో

సైనికుల పాత్ర కీలకం

రాయచూరు రూరల్‌: దేశఽ రక్షణలో సైనికుల పాత్ర కీలకమని దళిత సంఘర్ష సమితి అధ్యక్షుడు రవీంద్రనాథ్‌ పట్టి పేర్కొన్నారు. ఆయన ఆదివారం భారత సైనికుడిగా 24 ఏళ్ల పాటు దేశ సేవలు అందించిన విజయ కుమార్‌ పట్టికి నగరంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌లోని అంబేడ్కర్‌ ప్రతిమ వద్ద స్వాగతం పలికి మాట్లాడారు. దేఽశ సరిహద్దుల్లో సైనికులు నిరంతర రక్షణ ఇవ్వడం వల్ల దేశంలోని ప్రజలు ప్రశాంతంగా ఉన్నారన్నారు. దేశ సైనికుడు విజయ కుమార్‌ మాట్లాడుతూ 2002 నుంచి ఇంతవరకు భారత సైన్యంలో ఎలక్ట్రానిక్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో 24 ఏళ్లు, వివిధ శిక్షణా కేంద్రాల్లో 12 ప్యారా స్పెషల్‌ మిలిటరీ, గయా, భూపాల్‌, సియాచిన్‌, జమ్ము కశ్మీర్‌, అసోం సరిహద్దు ప్రాంతాల్లో విధులు నిర్వహించినట్లు తెలిపారు. సమావేశంలో విశ్వనాథ్‌ పట్టి, నరసింహులు, పరశురాం, సురేష్‌, పుష్పరాజ్‌, తమ్మణ్ణలున్నారు.

ఈవీ చార్జింగ్‌తో పర్యావరణ రక్షణ

రాయచూరు రూరల్‌: పర్యావరణ పరిరక్షణకు ఈవీ చార్జింగ్‌ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని నవోదయ వైద్య కళాశాల డైరెక్టర్‌ సుంకి అమృత రెడ్డి పిలుపు ఇచ్చారు. కళాశాలలో మూడు చోట్ల ఈవీ కేంద్రాలను ప్రారంభించామన్నారు. ప్రకృతి వైపరీత్యాలకు అనుగుణంగా వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ యూనిట్లు టాటా సంస్థ సహకారంతో ప్రారంభించడం అత్యవసరమన్నారు. నవోదయ ఇంజనీరింగ్‌ కళాశాల డీన్‌ సురేష్‌బాబు, రామ్‌ హన గుప్త, విజయ్‌ కుమార్‌లున్నారు.

అనుచిత పోస్ట్‌లపై చర్యలేవీ?

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌ను కించపరిచే విధంగా సోషల్‌ మీడియాలో, ఇన్‌స్టాలో పోస్ట్‌ చేిసిన వారిపై కేసు పెట్టి సమాజంలో పరస్పర గౌరవం, సామరస్యాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని యువజన కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మరిస్వామి డిమాండ్‌ చేశారు. ఆదివారం ఎస్పీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. సీఎంను అవమానిస్తూ, తమిళనాడు రారష్ట్‌రంతో భాషా, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టేలా ఇన్‌స్టాలో, సోషల్‌ మీడియాలో సామాజిక కార్యకర్త ఇష్టానుసారం నిందించారన్నారు. అనుచిత పోస్టుల నేపథ్యంలో నిందించిన వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఎస్పీ శాంతవీరకు వినతిపత్రం సమర్పించారు.

తల్లి పాలు అమృతం కన్నా శ్రేష్టం

హుబ్లీ: తల్లి పాలు అమృతం కన్నా శ్రేష్టమని, బిడ్డ పుట్టిన అర్ధగంటకే పాలు తాగించాలని ప్రముఖ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ రత్నమాల దేశాయి తెలిపారు. ధార్వాడ ఎస్‌డీఎం నర్సింగ్‌ కళాశాల సహకారంతో ఏర్పాటు చేసిన విశ్వ స్తన్యపాన సప్తాహ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. స్తన్యపానం తల్లీ బిడ్డ బంధాన్ని దృఢపరుస్తుందన్నారు. ఎస్‌డీఎం ఆస్పత్రిలో మానవ పాల బ్యాంక్‌ కూడా తల్లులకు ఉత్తమ సేవలు అందిస్తోందన్నారు. ఎస్‌డీఎం వర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పద్మలత నిరంజన్‌ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో స్తన్యపానం గురించి అవగాహన కల్పించే బొమ్మలాట ప్రదర్శన అలరించింది. పోస్టర్ల ప్రదర్శన, క్విజ్‌ పోటీలు, ఆరోగ్య జాగృతి, చర్చాగోష్టులు నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ విజయ్‌ కులకర్ణి, డాక్టర్‌ కిరణ్‌ హెగ్డే, డాక్టర్‌ సునీల్‌కుమార్‌, వివిధ విభాగాల ముఖ్యస్థులు, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement