రాయచూరు రూరల్: నగరంలో పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియకు ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఆదివారం నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జిల్లాధికారిణి పూవిత, ఎస్పీ అరుణాంగ్శు గిరి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. పరీక్ష కేంద్రాల చుట్టూ గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహించారు. పరీక్ష కేంద్రంలోకి ప్రతి అభ్యర్థి హాల్ టికెట్‌ను పరిశీలించిన తర్వాతే అనుమతించారు. 23 పరీక్ష కేంద్రాల్లో 15,780 మంది అభ్యర్థులు హాజరుకాగా 708 మంది గైర్హాజరయ్యారు. మాన్వి పరీక్ష కేంద్రంలో పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు సమాధానాలు చెబుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్పీ అరుణాంగ్శు గిరి మాన్వి ఏఎస్‌ఐ శివలింగప్పను సస్పెండ్ చేశారు.
విజయనగరలో...
హొసపేటె: సివిల్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ రాత పరీక్షలు ఆదివారం నగరంలో ప్రశాంతంగా జరిగాయి. విజయనగర జిల్లాలోని హొసపేటె నగరంలో 13 పరీక్ష కేంద్రాలలో మొత్తం 11,773 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. అన్ని కేంద్రాల చుట్టూ పటిష్టంగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అభ్యర్థులను తనిఖీ చేసి పరీక్ష హాలులోకి అనుమతించారు. మహిళా అభ్యర్థులు స్వచ్ఛందంగా తమ చెవిపోగులు, గాజులు బయటే వదిలి పరీక్ష గదిలోకి వెళ్లారు.
మాన్వి ఏఎస్‌ఐ సస్పెండ్


