హొసపేటె: తాలూకాలోని గుండా తాండా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మౌలిక సౌకర్యాల కొరతను ఎదుర్కొంటున్నారు. 2021–22వ సంవత్సరంలో గ్రామ పంచాయతీ ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన మరుగుదొడ్లు. ప్రస్తుతం వాటికి తలుపులు గానీ, నిర్వహణ గానీ లేక పూర్తిగా శిథిలావస్థలో, దుర్గంధభరితంగా ఉన్నాయి. మరుగుదొడ్ల ముందు పెరిగిన ముళ్లపొదలు విద్యార్థులకు, ముఖ్యంగా మహిళా విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిని కలిగిస్తున్నాయి. ఇంత తీవ్రమైన సమస్య ఉన్నప్పటికీ ముఖ్యోపాధ్యాయులు ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియడం లేదు. సంబంధిత విద్యాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తూ మౌనంగా ఉండటం విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. ఇలాంటి మౌలిక సౌకర్యాల కొరత విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభ్యాసంపై కూడా నేరుగా ప్రభావం చూపుతుంది. సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే పాఠశాలను సందర్శించి, సౌకర్యాల మెరుగునకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ పాఠశాలలో
మౌలిక సదుపాయాల కొరత
నిర్వహణ కరువై శిథిలావస్థకు చేరిన మరుగుదొడ్లు


