రాయచూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం పాలు కాగా రెండు ప్రమాదాల్లో ముగ్గురు మరణించిన ఘటనలు బీదర్, రాయచూరుల్లో జరిగాయి. శనివారం రాత్రి కలబుర్గి జిల్లా కమలాపుర తాలూకా కిణ్ణసడక్ వద్ద ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. బీదర్ నుంచి దావణగెరెకు వెళుతున్న బస్సు, కలబుర్గి నుంచి బీదర్‌కు వస్తున్న మరో బస్సు లారీని ఓవర్‌టేక్ చేయబోయి ఢీకొనడంతో బీదర్ డిపో–1కు చెందిన డ్రైవర్, ఏఐటీయూసీ అధ్యక్షుడు శివానంద(48) డిపో–2కు చెందిన తుకారాం(45) మరణించగా, పది మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని కలబుర్గి ఆస్పత్రికి తరలించారు. కమలాపుర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాయచూరు నుంచి మంత్రాలయం వెళ్లే దారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చెట్నిహళ్లికి చెందిన తిక్కయ్య(58) మరణించారు. డ్రైవర్ నిరక్ష్యం వల్ల ఈ ఘటన సంభవించింది. మాధవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మృతుల్లో ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు


