సాక్షి, బళ్లారి: నగరంలోని మోకా రోడ్డులో ఆదివారం స్టీల్ సిటీ రన్ ఉత్సాహంగా జరిగింది. 5 కిలోమీటర్లు, 10 కి.మీ, 16 కి.మీ.ల పరుగు పందేల్లో అన్ని వయస్సుల ప్రజలు పాల్గొన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ పరుగు ఆరోగ్యానికి మంచిదని అన్నారు. రోజూ వాకింగ్, రన్నింగ్ చేయడం ద్వారా ఆరోగ్యం బాగుంటుందన్నారు. పరుగు పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే నారా సూర్యనారాయణరెడ్డి, మేయర్ గాదెప్ప, జిందాల్ కంపెనీ ప్రముఖులు మురగన్, డాక్టర్లు బీ.కే.సుందర్, తిప్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


