రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా పంచముఖిలోని ప్రభుత్వ పాఠశాలలోకి మొబైల్ తేవద్దన్నందుకు ఓ విద్యార్థి ప్రధానోపాధ్యాయిని కారుపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రధానోపాధ్యాయిని శశికళ పాఠశాల గదిలోకి మొబైల్ తేవద్దంటూ హెచ్చరించినందుకు ఆమె కారుపై బండరాయి తీసుకుని దాడి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా అధికారులు మౌనం పాటించారు.
విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
రాయచూరు రూరల్: నేటి అధునిక సమాజంలో అణగారిపోతున్న విద్యారంగం అభివృద్ధికి పేద విద్యార్థులను ప్రోత్సహించి పెద్దల ఆశయాలు, ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని మేడిశెట్టి గోపాల్ అన్నారు. రాయచూరు తాలూకా శ్రీరామ నగర్ క్యాంప్, పత్తేపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మేడిశెట్టి గోవిందయ్య, భీమక్క, నరసయ్య, ఈరమ్మ, శాంతాబాయి, శంకర లింగయ్య చారిటబుల్ ట్రస్ట్ నుంచి పేద విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలను పంపిణీ చేసి మాట్లాడారు. ప్రజలతో మమేకమై పెద్దల సహకారంతో ఏకతాటిపై నడిచి ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో కొట్రేష్, మహంతేష్ బిరాదార్, సునీల్‌వర్మ, శివరాజ్, వీణ, అక్క మహాదేవిలున్నారు.


