విద్యార్థుల్లో ప్రతిభకు ప్రదర్శనలే తార్కాణం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల్లో ప్రతిభకు ప్రదర్శనలే తార్కాణం

Aug 2 2026 1:46 AM | Updated on Aug 2 2026 1:46 AM

రాయచూరు రూరల్‌ : విద్యార్థుల ప్రతిభకు ప్రదర్శనలు తార్కాణం కావాలని కేఈబీ పాఠఽశాల హెడ్‌ మాస్టర్‌ హీరాలాల్‌ పేర్కొన్నారు. శనివారం మాదర చెన్నయ్య సభాభవనంలో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించి మాట్లాడారు. సమాజ సేవ చేయాలనే తపన ప్రతి ఒక్కరిలో కలగాలన్నారు. స్వార్థం వదిలి నిస్వార్థంతో పని చేయాలన్నారు. విద్యార్థులకు భవిష్యత్తులో ఉత్తమ విద్యకు మంచి అవకాశాలుంటాయన్నారు. స్వశక్తితో ఉన్నత చదువులు అభ్యసించాలన్నారు. సంతోష్‌, రావుత్‌ రావ్‌, వీరేశ్‌, మారెప్ప, లోకేష్‌, మౌనేష్‌లున్నారు.

వణికించిన వర్షం

రాయచూరు రూరల్‌: నగరంలో శుక్రవారం రాత్రి వర్షం కురిిసింది. ఎక్కడ చూసినా రహదారులు చిత్తడిగా మారాయి. మంత్రాయం రహదారిలో నీరు నిలిచిపోయి ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగాయి. మున్నూరు వాడి, గాంధీ చౌక్‌, మహావీర్‌ చౌక్‌లలో వర్షపు నీరు చొరబడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement