
సామాజిక విప్లవ సారధి అరసు
హొసపేటె: మాజీ ముఖ్యమంత్రి, వెనుకబడిన వర్గాల సంక్షేమ సారధి దేవరాజ అరసు సామాజిక సమానత్వం తేవడానికి కృషి చేశారని జిల్లాధికారి ఎంఎస్ దివాకర్ అన్నారు. బుధవారం తన కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన దేవరాజ అరసు 110వ జయంతికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. అందరికీ సమానత్వానికి, సమాజంలో అణగారిన చిట్టచివరి వ్యక్తికి కూడా గౌరవం కల్పించడానికి ఆయన అనేక పథకాలను అమలు చేశారన్నారు. ఇదే సందర్భంగా జిల్లా స్థాయిలో ఎస్‌ఎస్‌ఎల్‌సీ, పీయూసీలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు, జిల్లా స్థాయిలో రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, క్రీడా పోటీలు, చర్చాగోష్టుల విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అదనపు జిల్లాధికారి ఈ.బాలకృష్ణప్ప, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిణి జి.శశికళ, జెడ్పీ డిప్యూటీ సెక్రటరీ కే.తిమ్మప్ప, జిల్లా మైనార్టీ అధికారి జావిద్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
అరసు ఆదర్శాలు అనుసరణీయం
రాయచూరు రూరల్: వెనుక బడిన వర్గాల అభివృద్ధికి దేవరాజ్‌అరసు ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని అదనపు జిల్లాధికారి శివానంద సూచించారు. మంగళవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో దేవరాజ్ అరసు 110వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దేవరాజ అరసు చిత్రపటానికి పూలమాల వేసి మాట్లాడారు. రాష్ట్రాన్ని పాలించిన సమయంలో వెనుక బడిన వర్గాల ప్రజలకు ఎలాంటి లోటు రాకుండా మంచి పాలన అందించారన్నారు. భూ సంస్కరణల చట్టంలో లోపాల సవరణకు తీసుకున్న నిర్ణయం హర్షణీయమన్నారు. ప్రజల కోసం జారీ చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేటికీ ప్రజలకు గుర్తున్నాయన్నారు. నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, ఏఎస్పీ కుమారస్వామి, శాంతప్ప, పాగుంటప్ప, సాంఘీక సంక్షేమ శాఖాధికారులు తిప్పారెడ్డి, సునీతలున్నారు.
డీసీసీ కార్యాలయంలో..
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్‌గాంధీ 81వ, దేవరాజ్ అరసు 110వ జయంతి వేడుకలను ఘనంగా చేపట్టారు. మంగళవారం నగరాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఇరువురు నేతల చిత్రపటాలకు పూలమాలలు వేశారు. దేశానికి వారు చేసిన సామాజిక సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అమరేగౌడ, శివమూర్తి, రాణి రిచర్డ్, శ్రీదేవి, ఆంజనేయ, మరిస్వామి, యల్లప్ప, నిర్మల, మాల, హేమలత, ప్రేమలత, లక్ష్మి, ఈరణ్ణలున్నారు.
చెళ్లకెరెలో..
చెళ్లకెరె రూరల్: వెనుకబడిన వర్గాల ప్రగతికి, దళితులు, అణగారిన వర్గాల వారికి సామాజిక న్యాయాన్ని కల్పించిన మాజీ ముఖ్యమంత్రి డీ.దేవరాజ అరసు ప్రజల మన్ననలు పొందారని నగరసభ అధ్యక్షురాలు శిల్ప తెలిపారు. ఆమె నగరంలోని దేవరాజ అరసు వసతి పాఠశాలలో ఏర్పాటు చేసిన దేవరాజ అరసు 110వ జయంతిలో పాల్గొని మాట్లాడారు. జీత పద్ధతి నిర్మూలన, దున్నేవాడిదే భూమి, వృద్ధాప్య, వితంతు వేతనం వంటి పథకాలను అమలు చేసి ప్రజల ముఖ్యమంత్రిగా పేరొందారన్నారు. నగరసభ ఉపాధ్యక్షురాలు కవిత, సభ్యులు జైతున్‌బీ, మల్లికార్జున, గద్దిగె తిప్పేస్వామి, తహసీల్దార్ రెహాన్ పాషా, టీపీ ఈఓ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.

సామాజిక విప్లవ సారధి అరసు

సామాజిక విప్లవ సారధి అరసు

సామాజిక విప్లవ సారధి అరసు

సామాజిక విప్లవ సారధి అరసు