
అచ్యుతం.. కేశవం
● వైష్ణవాలయాల్లో బెణక అమావాస్య పూజలు
మండ్య: బెనక అమావాస్య కావడంతో శనివారం నగరంతో పాటు జిల్లాలోని అన్ని వైష్ణవ ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు జరిగాయి. నగరంలోని హనియంబాడి రోడ్డులోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు నెరవేర్చారు. మధ్యాహ్నం భక్తులకు అన్నసంతర్పణ ఏర్పాటు చేశారు. నగరంలోని లక్ష్మీ జనార్దనస్వామి ఆలయం, శ్రీనివాస ఆలయం, తాలూకాలోని కంబద నరసింహ స్వామి ఆలయాల్లో విశేష పూజలు జరిపించారు. భక్తులు ఆలయాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. మద్దూరు పట్టణంలోని ఉగ్రనరసింహ స్వామి ఆలయంలో, శ్రీరంగపట్టణలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన రంగనాథస్వామి ఆలయం, పాండవపుర తాలూకా మేలుకోటె చెలువ నారాయణస్వామి ఆలయం తదితరాలలో విశేష అర్చనలు సాగాయి.

అచ్యుతం.. కేశవం