
త్వరలో రెండో విడత సామాజిక సర్వే
సామాజిక సమీక్షలో మీటర్ రీడర్ల పాత్ర
ఏ ఇల్లూ మిస్ కాకుండా సర్వే
శివాజీనగర: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వెనుకబడిన వర్గాల సామాజిక, విద్యా సమీక్షను 90 రోజుల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో చేపట్టాం, రెండో విడత సర్వేను సెప్టెంబరు 22వ తేదీ నుంచి అక్టోబర్ 7 వరకు నిర్వహిస్తామని కమిషన్ అధ్యక్షుడు ఆర్.మధుసూదన్ నాయక్ చెప్పారు. విద్యుత్ శాఖలోని మీటర్ రీడర్లను కూడా ఇందులో భాగస్వాములను చేస్తామని తెలిపారు. శనివారం నుంచి కమిషన్ సన్నాహాలను ప్రారంభించినట్లు తెలిపారు. విద్యుత్ మీటర్ రీడర్లు అన్ని ఇళ్లను జియో ట్యాగింగ్ చేస్తారు. ఏ ఇల్లు తప్పిపోకుండా సర్వే జరుగుతుంది అని తెలిపారు.
కరెంటు కనెక్షన్ ఆధారం
రాష్ట్రంలో ఉన్న అన్ని ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ ఉంది. మీటర్ నంబరు ఆధారంగా అన్ని ఇళ్లలోని కుటుంబాల సర్వే సాగిస్తామన్నారు. ఈసారి దసరా సెలవులు ఉన్నందున సర్వేకు అనుకూలమవుతుందని తెలిపారు. ఒక్క కుటుంబం కూడా తప్పిపోదన్నారు. సర్వే కోసం యాప్‌ను రూపొందించినట్లు చెప్పారు. ప్రతి ఇంటి మీటరు, ఇంటి ఫోటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేస్తారన్నారు. ప్రతి ఇంటికి ప్రత్యేకమైన నంబర్ ఇచ్చి, స్టిక్కర్‌ను అతికిస్తారని చెప్పారు.
మీటర్ రీడర్లకు కూడా భాగస్వామ్యం

త్వరలో రెండో విడత సామాజిక సర్వే