మైక్రో వేధింపులకు మహిళ బలి | - | Sakshi
Sakshi News home page

మైక్రో వేధింపులకు మహిళ బలి

Aug 24 2025 8:32 AM | Updated on Aug 24 2025 8:32 AM

మైక్ర

మైక్రో వేధింపులకు మహిళ బలి

సాక్షి బళ్లారి: రాష్ట్రంలో మైక్రోఫైనాన్స్‌ వేధింపులతో ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంటోంది. శనివారం చిత్రదుర్గ జిల్లా కవాడిగర హట్టిలో మైక్రోఫైనాన్స్‌ వేధింపులతో నేత్ర(30) అనే మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మైక్రో ఫైనాన్స్‌ సంస్థలో రూ.50 వేలు అప్పు తీసుకొని తిరిగి ఇవ్వలేక పోయింది. దీంతో వేధింపులకు గురి చేయడంతో సదరు మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై చిత్రదుర్గ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సిద్దారూఢ మఠానికి

కానుకల వర్షం

హుబ్లీ: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న సిద్దారూఢ మఠంలోని కానుకల హుండీలో 34 రోజులకు రూ.53,92,080 ఆదాయం లభించింది. రూ.4,45,050 విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను భక్తులు సమర్పించారు. ఈ నెల 20న మఠంలోని కానుకల హుండీలను ఎస్‌బీఐ సిద్దారూఢ నగర శాఖ మేనేజర్‌, సంబంధిత సిబ్బంది, భక్తుల సమక్షంలో తెరిచి లెక్కించారు. పర్యవేక్షణ ట్రస్ట్‌ కమిటీ చైర్మన్‌ చెన్నవీర ముంగురవాడి, వైస్‌ చైర్మన్‌ వినాయక ఘోడ్కే, గౌరవ కార్యదర్శి రమేష్‌ బెళగావి, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

ఉత్తమ గ్రంథ పాలక అవార్డు ప్రదానం

రాయచూరు రూరల్‌: రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ గ్రంథ పాలకుడిగా సతీశ్‌ కుమార్‌కు అవార్డు లభించింది. డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ కేంద్ర గ్రంథాలయంలో 14 ఏళ్ల పాటు విధులు నిర్వహించిన సతీష్‌ కుమార్‌కు కలబుర్గిలో జరిగిన జాతీయ సమ్మేళనంలో ఆప్టిమైజేషన్‌ ఫ్రేమ్‌ వర్క్‌ ఆధారంగా ఉత్తమ గ్రంథ పాలక అవార్డును అందించి సన్మానించారు.

గుప్త నిధుల కోసం తవ్వకాలు

శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు

సాక్షి బళ్లారి: గుప్త నిధుల కోసం శివలింగం వద్ద దుండగులు తవ్వి పక్కన పడేశారు. చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ తాలూకా మడదికెరె ఫిర్కా పరిధిలోని సన్నకిట్టదహళ్లి గ్రామ శివార్లలో ఉన్న నింగప్పనగుడ్డలో వెలసిన ఈశ్వర ఆలయంలో గుప్త నిధులున్నాయని ఆశపడిన దుండగులు ఆలయంలోని శివలింగాన్ని తవ్వడం కలకలం రేపింది. చుట్టుపక్కల గ్రామాలకు ఆరాధ్యదైవమైన ఈశ్వరుని గుడిలో గుప్త నిధుల కోసం ఏకంగా శివలింగాన్ని తవ్వి పక్కన పెట్టడంతో శివభక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై హొసదుర్గ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోస్టర్ల విడుదల

రాయచూరు రూరల్‌ : నగరంలో ఉర్దూ అకాడమి ఆధ్వర్యంలో శుక్రవారం సాహిత్యం(ముశాయిరా)పై పోస్టర్లను విడుదల చేశారు. నగరంలోని శమీం భవనంలో కవితలు, సాహిత్యం గురించి మైనార్టీలకు వివరించడానికి ఉర్దూ అకాడమి ఆధ్వర్యంలో జరగనున్న ముశాయిరాను ఈనెల 24 నుంచి ఏర్పాటు చేశామని రాష్ట్ర ఉర్దూ అకాడమి అధ్యక్షుడు ముఫ్తి మహ్మద్‌ అలీ ఖాజీ అన్నారు. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో అధికంగా ఉన్న మైనార్టీలకు సాహిత్యం, కవిగోష్టులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఇఫ్తికార్‌, ఇర్ఫాన్‌, ముబీన్‌, ఇజాజ్‌ పాషా, అనీస్‌ సిద్దికిలున్నారు.

మైక్రో వేధింపులకు మహిళ బలి 1
1/3

మైక్రో వేధింపులకు మహిళ బలి

మైక్రో వేధింపులకు మహిళ బలి 2
2/3

మైక్రో వేధింపులకు మహిళ బలి

మైక్రో వేధింపులకు మహిళ బలి 3
3/3

మైక్రో వేధింపులకు మహిళ బలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement