
మారెమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు
చెళ్లకెర రూరల్: మధ్య కర్ణాటక ఆరాధ్య దేవత గౌరసముద్ర మారెమ్మ దేవి జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి. భక్తులు ఇబ్బందులు పడకుండా తగిన సౌకర్యాలు కల్పించాలని గ్రామ పంచాయతీ అధ్యక్షుడు ఓబన్న తెలిపారు. శుక్రవారం జాతర జరిగే తుమ్మల ప్రదేశాన్ని అధికారులతో కలసి పరిశీలించారు. ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరగడం వల్ల పార్కింగ్ వ్యవస్థ కోసం పోలీసుల సహకారం అవసరమన్నారు. తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతర జరిగే తుమ్మల వద్ద అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రేహన్ పాషా, డీవైఎస్పీ టీటీ రాజన్న, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హనుమంతప్ప, గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.