
‘రక్తదానంతో ప్రాణాలు కాపాడొచ్చు’
రాయచూరురూరల్: సమాజంలో ఆపద, అత్యవసర సయమంలో రక్తదానం చేయడానికి యువకులు ముందుకు రావాలని ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం సంచాలకురాలు స్మిత పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలోని ఎల్‌వీడి కళాశాల మైదానంలో ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం, జిల్లా పంచాయీఈ, జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, రోటరీ క్లబ్, రిమ్ష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంచాలకురాలు స్మిత మాట్లాడుతూ.. రక్తదానం చేయడం వల్ల కొత్త రక్తం ఉత్తత్తి అయ్యేందుకు అవకాశాలు ఉంటాయన్నారు. రక్తదానంతో మరొకరి ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు. రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇది స్ఫూర్తిదాయకం కావాలన్నారు. కార్యక్రమంలో డా.శ్యామణ, వెంకటేష్ నాయక్, లక్ష్మీకాంత రెడ్డి, గిరీష్, రవి, సుఖాణి, రాజేంద్ర, త్రివిక్రం జోషి, నీలోఫర్, శ్రీశైల అమరఖేడ, కేశవ రెడ్డి, రాజణ్ణ, నాగరాజ తదితరులు పాల్గొన్నారు.
నాలుగు రోజుల పాటు రక్తదాన శిబిరాలు
బళ్లారిటౌన్: స్థానిక పార్వతీ నగర్‌లో ఉన్న శివధ్యాన మందిరంలో శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు మెగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కన్వీనర్ బీకే నిర్మల తెలిపారు. శుక్రవారం విశ్వవిద్యాలయ ఆవరణలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈనెల 25న రాజయోగిని దాది ప్రకాష్ మణిజి జ్ఞాపకంగా భారత రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో విశ్వబంధుత్వం దినోత్సవాన్ని జరుపుకున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా లక్ష మంది నుంచి రకాన్ని సేకరించేందుకు లక్ష్యం పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 65 ఏళ్లలోపు వారు రక్తదానం చేయవచ్చన్నారు. బళ్లారిలో 250 మంది నుంచి సేకరించిన రక్తాన్ని స్థానిక బీమ్స్ రక్త బంధనానికి సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో విశ్వవిద్యాలయం నేతలు మంజుళ, రాజేశ్వరి, రష్మి తదితరులు పాల్గొన్నారు.

‘రక్తదానంతో ప్రాణాలు కాపాడొచ్చు’