
తగ్గని వరద ప్రవాహం
రాయచూరు రూరల్: కర్ణాటక ఎగువ భాగంలో నదీ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఉత్తర, కళ్యాణ కర్ణాటకలో బెళగావి, విజయపుర, బాగల్ కోట, కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాల్లో వరద ప్రవహిస్తోంది. శనివారం నారాయణ పుర డ్యాం నుంచి 2.65 లక్షల క్యూసెక్కుల నీటిని వదలారు. దేవదుర్గ తాలూకా కోప్పర రహదారి పూర్తిగా కొట్టుకుని పోయింది. దేవదుర్గ తాలుకా హువిన హడగలి, శహపూర తాలుకా కోళూరు వంతెనపై వరద నీరు ప్రవహించడంతో కలబుర్గికి రాకపోకలు స్థంభింపజేశారు. ప్రవాహ పరిస్థితిపై జిల్లాధికారి నీతిష్ అధికారులతో చర్చించారు. యాదగిరి జిల్లా సురుపురలో జిల్లాధికారి హరీష బోయర్, ఎస్పీ పృథ్వీ శంకర్ పరీశీలించారు. హువిన హడగలి వద్ద బసవేశ్వర దేవాలయం నీటి మునిగింది. తుంగభద్ర, కృష్ణా నది తీర ప్రాంతాల్లోకి నీటి ప్రవాహం రావడంతో ప్రజలను అప్రమత్తం చేసేందుకు అధికారులు సహకరించాలని జిల్లాధికారి నీతిష్ సూచించారు. శుక్రవారం కార్యాలయంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు ఇచ్చారు. తుంగభద్ర తీరంలో మాన్వి, రాయచూరు, గిల్లేసూగురు, కృష్ణా నది తీరంలో దేవసూరు, దోంగ రాంపూర్, అత్కూర్, బూడిద పాడు, నారద గడ్డ దత్తాత్రేయ దేవాలయం ప్రాంతాల ప్రజల రక్షణకు ముందుండాలని సూచించారు.
వాగులు, వంతెనలపై
ప్రవహిస్తున్న నీరు
నారాయణ పుర డ్యాం నుంచి 2.65 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల
లోతట్టు ప్రాంతాల ప్రజలు
అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

తగ్గని వరద ప్రవాహం

తగ్గని వరద ప్రవాహం

తగ్గని వరద ప్రవాహం