కృష్ణా జలాలపై సీఎం సమీక్ష
బనశంకరి: కృష్ణా జలాల వివాదం, ట్రైబ్యునల్ అంతిమ తీర్పు అమలు గురించి అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం సిద్దరామయ్య నిర్ణయించారు. కృష్ణా న్యాయధీకరణ–2 గెజెట్ ఆదేశాల గురించి చర్చించడానికి కేంద్ర జలవనరులు శాఖ మంత్రి రాష్ట్రాల మంత్రులను ఆహ్వానించిన నేపథ్యంలో శనివారం సీఎం నివాసమైన కావేరిలో ఉన్నతస్థాయి సమావేశం జరిపారు. రాష్ట్ర రైతుల శ్రేయస్సు కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్ర నీటి వాటా కోసం అన్ని ప్రయత్నాలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకువస్తామన్నారు. ఉత్తర కర్ణాటక రైతులు తమ వాటా జలాల కోసం అనేక ఏళ్లుగా వేచిచూస్తున్నారని తెలిపారు. అలాగే కావేరి జల వివాదాల గురించి చర్చించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మంత్రులు పాల్గొన్నారు.
కృష్ణా జలాలపై సీఎం సమీక్ష


