స్టీరింగ్‌ మీదే సిటీ బస్‌ డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

స్టీరింగ్‌ మీదే సిటీ బస్‌ డ్రైవర్‌ మృతి

Nov 7 2024 1:04 AM | Updated on Nov 7 2024 12:42 PM

-

దొడ్డబళ్లాపురం: సిటీ బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు వచ్చి స్టీరింగ్‌ మీదే తుది శ్వాస విడిచిన సంఘటన బెంగళూరు పరిధిలోని నెలమంగల తాలూకా బిన్నిమంగల బస్టాండు వద్ద చోటుచేసుకుంది. కిరణ్‌కుమార్‌ (40).. దాసనపుర బస్‌ డిపో బీఎంటీసీ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆరేళ్లుగా ఆయన ఉద్యోగంలో ఉన్నారు. బుధవారం ఉదయం బస్సు నడుపుతుండగా కిరణ్‌కు గుండెపోటు వచ్చింది. 

వెంటనే బస్సును రోడ్డు పక్కన సురక్షితంగా నిలిపి అలాగే ప్రాణాలు వదిలాడు. కండక్టర్‌, ఇతర ప్రయాణికులను ఆయనను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అస్వస్థతకు గురికాగానే శరీరం సహకరించకున్నా బస్సును నేర్పుగా రోడ్డు పక్కకు నిలిపిన దృశ్యాలు, స్టీరింగ్‌ మీదకు పడిపోయిన దృశ్యం బస్సులోని సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. నెలమంగల పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement