బనశంకరి: రాజధాని నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. తన అన్నకు బ్రేకప్ చెప్పిన యువతిని అతని తమ్ముడు కత్తితో పొడిచాడు, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ ఘటన జీవన బీమానగర పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు... కోడిహళ్లిలో తల్లిదండ్రులు, సోదరునితో కలిసి అమృత (22) నివసిస్తోంది. ఆమె లా రెండో ఏడాది చదువుతోంది. ఖాళీ టైంలో పిజ్జా షాప్‌లో పనిచేసేది. కోడిహళ్లికి చెందిన ధనుశ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతనికి ఇప్పటికే వివాహమై, కొడుకు ఉండగా విడాకులు తీసుకున్నాడు. ఆ విషయం దాచిపెట్టి అమృతతో ప్రేమాయణం సాగించాడు. కొన్నాళ్లకు ఇది తెలిసి ప్రేమను తెంచుకుని దూరం పెట్టింది. ధనుశ్ సోదరుడు సూర్యకు ఈ సంగతి చెప్పడంతో అతడు ఆమైపె పగ పెంచుకున్నాడు.
నడిరోడ్డుపై దాడి
ఈ నెల 13వ తేదీన కోడిహళ్లిలో కాలేజీ నుంచి అమృత ఇంటికి నడుచుకుని వస్తుండగా సూర్య నడిరోడ్డుపై చాకుతో ఇష్టానుసారం పొడిచి పారిపోయాడు. రక్తపుమడుగులో పడి ఉన్న యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. 3 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన అమృత బుధవారం రాత్రి మృతిచెందింది. ధనుశ్, సూర్యలను జీవన బీమానగర పోలీసులు అరెస్టు చేశారు.
న్యాయ విద్యార్థిని హత్య
ప్రియుని తమ్ముని దారుణం
బెంగళూరులో ఘటన


