మృత్యుపాశమైన కరెంటు తీగ | - | Sakshi
Sakshi News home page

మృత్యుపాశమైన కరెంటు తీగ

Mar 24 2024 1:15 AM | Updated on Mar 24 2024 11:44 AM

- - Sakshi

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నర్సు మృతి

ఆమె భర్తకు తీవ్ర గాయాలు

బైక్‌లో వెళ్తుండగా ఘటన

తుమకూరు: భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా కరెంటు తీగ తెగిపడి నర్సు మృతి చెందింది. ఈ విషాద ఘటన తుమకూరు జిల్లా, కుణిగల్‌ తాలూకా ఇప్పాడి గ్రామంలో చోటు చేసుకుంది.బాగల్‌కోటె జిల్లా బాదామి తాలూకా చించలకట్టె గ్రామానికి చెందిన లక్ష్మీబాయి జాదవ్‌(36) తుమకూరు జిల్లా కుణిగల్‌ తాలూకాలోని ఇప్పాడిలో ఉన్న పీహెచ్‌సీలో నర్సుగా పనిచేస్తోంది.

ఆమె భర్త లక్ష్మణ్‌ ఇదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. దంపతులు ఇద్దరూ కుణిగల్‌లో నివాసం ఉంటున్నారు. లక్ష్మీబాయి జాదవ్‌ విధులు ముగించుకొని భర్తతో కలిసి బైక్‌లో ఇంటికి వెళ్తుండగా మార్గం మధ్యలో కరెంటు తీగ తెగి వారిపై పడింది. ఘటనలో లక్ష్మీబాయి జాదవ్‌ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. లక్ష్మణ్‌కు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. కుణిగల్‌ పోలీసులు లక్ష్మీబాయి జాదవ్‌ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement