రూ.10 కోట్ల వజ్రాలు రూ.3 కోట్లకే | - | Sakshi
Sakshi News home page

రూ.10 కోట్ల వజ్రాలు రూ.3 కోట్లకే

Mar 19 2024 12:25 AM | Updated on Mar 19 2024 8:10 AM

సీజ్‌ చేసిన నకిలీ వజ్రాలు   - Sakshi

సీజ్‌ చేసిన నకిలీ వజ్రాలు

దొడ్డబళ్లాపురం: రూ.10 కోట్ల విలువైన వజ్రాలను రూ.3 కోట్లకే ఇస్తామని నమ్మించి వ్యాపారిని మోసం చేయడానికి యత్నించిన నలుగురిని బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయం పోలీసులు అరెస్టు చేసారు. రవి, నవీన్‌కుమార్‌, అహ్మద్‌, అబ్దుల్‌ దస్తగిరి పట్టుబడ్డ నిందితులు. లక్ష్మినారాయణ అనే వజ్రాల వ్యాపారికి వాట్సాప్‌ కాల్‌ చేసి పై విధంగా ప్రలోభపెట్టారు. డీల్‌ కుదుర్చుకోవడానికి నిందితులు, వ్యాపారి ఎయిర్‌పోర్టు వద్ద తాజ్‌ హోటల్‌లో కలిశారు. వ్యాపారి ఆ వజ్రాలను పరిశీలించగా అవి నకిలీవని తెలిసింది. దీంతో ఎయిర్‌పోర్టు పోలీసులకు సమాచారం ఇవ్వగా నిందితులను అరెస్టు చేసి నకిలీ వజ్రాలను సీజ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement