బైక్‌ ప్రమాదంలో యూట్యూబర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌ ప్రమాదంలో యూట్యూబర్‌ మృతి

Oct 30 2023 12:14 AM | Updated on Oct 30 2023 8:52 AM

- - Sakshi

రెండు బైక్‌లు ముఖాముఖి ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన బెంగళూరు యలహంక ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌

దొడ్డబళ్లాపురం: రెండు బైక్‌లు ముఖాముఖి ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన బెంగళూరు యలహంక ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దొడ్డబళ్లాపురం–యలహంక రహదారి మార్గంలోని బీఎస్‌ఎఫ్‌ క్యాంపస్‌ ముందు శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. యూట్యూబర్‌ గణి, బీఎస్‌ఎఫ్‌ క్యాంపస్‌ ఉద్యోగి సుధాకర్‌ దుర్మరణం చెందారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలపై వీడియోలు తీస్తూ ప్రజల్లో అవగాహన తీసుకువస్తున్న యూట్యూబర్‌ గణి.. తానే రోడ్డు ప్రమాదానికి బలి కావడం అభిమానులను కలచివేసింది.

గణి బుల్లెట్‌ బైక్‌పై వేగంగా వస్తుండగా బీఎస్‌ఎఫ్‌ క్యాంపస్‌ నుండి సుధాకర్‌ స్కూటర్‌లో వచ్చాడు. ఎదురెదురుగా ఢీకొనగా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.

సుధాకర్‌ అక్కడికక్కడే మృతిచెందగా, గణి ఆస్పత్రికి తరలించగా చికిత్స ఫలించక చనిపోయాడు. ఇద్దరూ హెల్మెట్‌ ధరించకపోవడం గమనార్హం. యలహంక ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement