సబ్‌ కాంట్రాక్టర్‌ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

సబ్‌ కాంట్రాక్టర్‌ ఆత్మహత్య

Oct 16 2023 1:04 AM | Updated on Oct 16 2023 9:51 AM

మీడియాతో మాట్లాడుతున్న మృతుడి తల్లి  - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న మృతుడి తల్లి

గంగావతి రూరల్‌: నగరంలో ఓ సబ్‌ కాంట్రాక్టర్‌ ఆత్మహత్య కలకలం రేపింది. మృతుడి డెత్‌నోట్‌ ఆధారంగా ఏడుగురిపై కొప్పళ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. కొప్పళలోని బీటీ పాటిల్‌ నగరలో ఉంటున్న రాజీవ్‌ బడాగే ఆత్మహత్య చేసుకున్నాడు. నాలుగు రోజుల క్రితం ఇతను విషం తాగాడు. కుటుంబ సభ్యులు హుబ్లీలోని కేఐఎం ఆస్పత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ రాజీవ్‌ మృతి చెందాడు. దీంతో రాజీవ్‌ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆత్మహత్యకు ముందు రాజీవ్‌ రాసిన డెత్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఏడుగురి వ్యకుల పేర్లు రాశారు. వారి వేధింపుల వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు. ఇక సబ్‌ కాంట్రాక్ట్‌ పనులు పూర్తి చేసినా బిల్లులు రాలేదని, మరి కొందరు బెదిరింపులు కూడా అతని ఆత్మహత్యకు కారణమని రాజీవ్‌ తండ్రి మోహన్‌ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement