ప్రవాస భారతీయురాలు ఆత్మహత్య ? | - | Sakshi
Sakshi News home page

ప్రవాస భారతీయురాలు ఆత్మహత్య ?

Aug 27 2023 12:36 AM | Updated on Aug 27 2023 8:45 AM

- - Sakshi

కర్ణాటక: ఆస్ట్రేలియా ప్రవాస భారతీయురాలు శవం ధార్వాడలో అనుమానాస్పద స్థితిలో గత ఆదివారం లభించింది. ధార్వాడకు చెందిన ఆస్ట్రేలియా నివాసి ప్రియాదర్శిని లింగరాజ పాటిల్‌ (40) ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. వివరాలు...ప్రియాదర్శినికి ఇద్దరు పిల్లలు. భర్తతో ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్నారు. అక్కడి పౌరసత్వం ఉంది.

అయితే ఇటీవల ఇండియాకు వచ్చిన ప్రియదర్శిని స్వగ్రామానికి రాలేదని ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మాజీ మేయర్‌ వీరేశ్‌ మీడియాతో మాట్లాడుతూ... ప్రియదర్శిని పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఈ విషయంపై ఆమె తీవ్ర మనోవేదనలో ఉందని, ఈనెల 18 భారత్‌కు వచ్చిన ప్రియదర్శిని బెంగళూరులో ఒకరోజు స్నేహితుల ఇంటిలో ఉన్నారు.

మరుసటి రోజు ధార్వాడ వెళ్తున్నట్లు చెప్పి బస్సు ఎక్కి గోగాక్‌ టికెట్‌ తీసుకున్నారు. అయితే గోగాక్‌కు బదులు సవదత్తిలో దిగి నవిళుతీర్థలో ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఆమె పిల్లలను ఆస్ట్రేలియా నుంచి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషితో మాట్లాడామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement