చిన్నారులపై దూసుకెళ్లిన వాహనం | - | Sakshi
Sakshi News home page

చిన్నారులపై దూసుకెళ్లిన వాహనం

Aug 11 2023 7:20 AM | Updated on Aug 11 2023 8:04 AM

మృతిచెందిన చిన్నారులు రోహిన్‌, శాలిని   - Sakshi

మృతిచెందిన చిన్నారులు రోహిన్‌, శాలిని

గూడ్స్‌ వాహనం ఢీకొని ఇద్దరు చిన్నారులు మృతిచెందగా, మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డ ఘోర దుర్ఘటన

కర్ణాటక: గూడ్స్‌ వాహనం ఢీకొని ఇద్దరు చిన్నారులు మృతిచెందగా, మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డ ఘోర దుర్ఘటన రామనగర తాలూకా గొల్లరదొడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. రోహిన్‌ (5), శాలిని (8) మృతులు, సుచిత్‌, గౌతమి అనే మరో ఇద్దరు క్షతగాత్రులు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో నలుగురు పిల్లలు ట్యూషన్‌ ముగించుకుని ఇళ్లకు నడిచి వస్తుండగా టాటాఏస్‌ గూడ్స్‌ వాహనం ఢీకొంది.

తీవ్ర గాయాలపాలైన నలుగురు పిల్లలను ఆస్పత్రికి తరలించగా రోహిన్‌,శాలిని చికిత్స ఫలించక మృతిచెందారు. ప్రమాదం జరిగిన వెంటనే గూడ్స్‌ వాహనం డ్రైవర్‌ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధిత తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement