భార్య మరొకరితో వెళ్లిపోతే.. ఈ భర్త ఏం చేశాడంటే.. | - | Sakshi
Sakshi News home page

భార్య మరొకరితో వెళ్లిపోతే.. ఈ భర్త ఏం చేశాడంటే..

Jun 19 2023 9:34 AM | Updated on Jun 19 2023 9:32 AM

- - Sakshi

దివాకర్‌ ఆమెతో పరిచయం పెంచుకుని పది రోజుల క్రితం తనతో పాటు లేవదీసుకుపోయాడు.

మడకశిర రూరల్‌: మాయమాటలతో తన భార్యను లేవదీసుకుపోయిన యువకుని చిత్రపటానికి చెప్పుల హారం వేసి ఓ భర్త వినూత్న నిరసన వ్యక్తం చేశాడు. వివరాలు.. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం క్యాంపురం గ్రామానికి చెందిన నేత్రావతి, అంజి భార్యాభర్తలు. బెంగళూరుకు వలస వెళ్లి అక్కడే ఓ తోటలో కూలి పనులతో జీవనం సాగించేవారు.

ఇదే గ్రామానికి చెందిన దివాకర్‌ సైతం బెంగళూరులో కూలి పనులు చేస్తుండేవాడు. నేత్రావతిపై కన్నేసిన దివాకర్‌ ఆమెతో పరిచయం పెంచుకుని పది రోజుల క్రితం తనతో పాటు లేవదీసుకుపోయాడు. దీంతో తీవ్ర మనోవేదనకు లోనైన అంజి క్యాంపురానికి చేరుకుని జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు వివరించాడు.

ఈ క్రమంలోనే కసి తీర్చుకోవాలని అంజి.. శనివారం రాత్రి దివాకర్‌ చిత్రపటానికి చెప్పులు వేసి సైకిల్‌పై డప్పు వాయిద్యాల మధ్య గ్రామంలో ఊరేగించాడు. ఇది చూసిన స్థానికులు దివాకర్‌ చిత్రపటంపై ఉమ్మేసి చెప్పుతో కొట్టారు. దివాకర్‌ ఇంటి ఎదుట పాదరక్షలు వేసిన చిత్రపటాన్ని ఉంచారు.

Advertisement
 
Advertisement
Advertisement